ఖమ్మం రూరల్, ఏప్రిల్ 7: తెలంగాణ ధాన్యం కొనేదిలేదంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు మండలం నుంచి రైతులు, కూలీలు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో నాయుడుపేట సర్కిల్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ సభ్యుడు వై.వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సం జీవరెడ్డి, వైస్ ఎంపీపీ దర్గయ్య, నాయకులు ముత్యం కృష్ణారావు, అక్కినపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
బోనకల్లు, ఏప్రిల్ 7: ఖమ్మంలో మహాధర్నాకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, నాయకులు వేమూరి ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు ఉన్నారు
చింతకాని, ఏప్రిల్ 7: మండలం నుంచి సుమారు 500 ద్విచక్ర వాహనాలతో వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ఖమ్మం వెళ్లారు. చింతకానిలో ర్యాలీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య ప్రారంభించారు.
మధిర టౌన్, ఏప్రిల్ 7: పట్టణం నుంచి నాయకులు కార్లలో ర్యాలీగా ఖమ్మం వెళ్లారు. దీనిని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు ప్రారంభించారు.
ఎర్రుపాలెం, ఏప్రిల్ 7: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మండలంలోని మొలుగుమాడు గ్రామ రైతులు నల్ల జెండాలతో రాస్తారోకో చేశారు. ఆ తరువాత మహాధర్నాకు వెళ్లారు. ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్, ఏప్రిల్ 7: మహాధర్నాకు మండలం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లారు. వీరిలో ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్‌రావు, నాయకులు మల్లీడు వెంకటేశ్వర్లు, సేట్రామ్నాయక్, వేముల వీరయ్య, మహ్మద్ ఆసిఫ్ పాషా తదితరులు ఉన్నారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 7: కేంద్రం తీరును నిరసిస్తూ తిరుమలాయపాలెంలోని ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. పార్టీ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, ఎంపీపీ బోడ మంగీలాల్, నాయకులు చావా వేణు, చామకూరి రాజు, చావా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, ఏప్రిల్ 7: మహాధర్నాకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా ఖమ్మం వెళ్లారు. ఎంపీపీ హరిప్రసాద్, నాయకులు యర్రవెంకన్న, కోటి అనంతరాములు, శ్రీనివాస్ యాదవ్, బిక్షం, మల్లయ్య, షేక్ కాజా, కోటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.