రామవరం, ఫిబ్రవరి 17: సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇైంక్లెన్లో షేక్ గౌసుద్దీన్ అనే యువకుడు జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిలో ఒక మెట్టు పైకి ఎక్కేందుకు ఇటీవల శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. గురువారం యాజమాన్యం శాంప్లింగ్ మజ్దూర్ పోస్టులకు పరీక్ష నిర్వహించింది. ఇక్కడే యువకుడికి చిక్కు వచ్చింది. ఇదే రోజు ఉదయం 10:30 గంటలకు వివాహ వేడుక జరగాల్సి ఉన్నది. షేక్ గౌసుద్దీన్ మాత్రం భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇచ్చాడు. కచ్చితంగా పరీక్ష రాయాలనుకున్నాడు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష రాసి ఆ తర్వాత మండపానికి వెళ్లి నిఖా చేసుకున్నాడు.