e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఖమ్మం మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా నగరంలో ‘ముక్కోటి వృక్షార్చన’

మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా నగరంలో ‘ముక్కోటి వృక్షార్చన’

  • మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా నగరంలో ‘ముక్కోటి వృక్షార్చన’

ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం ఎడ్యుకేషన్‌/ మామిళ్లగూడెం/ ఖమ్మం సిటీ, జూలై 24: యువనేత, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున పుడమితల్లి పులకించింది. బర్త్‌డే సందర్భంగా శనివారం చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. ఊరూరా.. వాడవాడలా పెద్ద పెద్ద మొక్కలు నాటి నేలతల్లిని పచ్చదనంతో పరిచేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు గులాబీ జెండాలను ఎగురవేశాయి. మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. రఘునాథపాలెం మండలంలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కూడా మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌బీఐటీ కళాశాలలో వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఐటీ రంగానికి, భవిష్యత్‌ తెలంగాణకు దిక్చూచిలాయువ నాయకుడు కేటీఆర్‌ నిలిచారని కళాశాల చైర్మన్‌ ఆర్జేసీ కృష్ణ అన్నారు.

మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను టీఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. మేయర్‌ నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు, సుడా డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగ, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన నిర్వహించారు. విరివిగా మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు కార్పొరేటర్లందరూ తమ తమ డివిజన్లలో విరివిగా మొక్కలు నాటించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్‌ ఇచ్చిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు మమత ఆసుపత్రి రోడ్డులో మొక్క నాటారు. శనివారం ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి రోడ్‌లో మొక్కలు నాటారు.

- Advertisement -

యూత్‌ ఐకాన్‌ ‘కేటీఆర్‌’
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ యువతకు ఐకాన్‌గా, పార్టీ నేతలకు మార్గదర్శకుడిగా కార్యదక్షతతో పనిచేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. యువతనే పుట్టిన రోజున చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా రఘునాథపాలెం మండలంలోని కోయచలక, రేగులచలక, కోటపాడు గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ‘కిసాన్‌ భాయ్‌’ అనే చిత్రపటాన్ని మంత్రికి బహూకరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana