వైరా, ఫిబ్రవరి 16 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఏన్కూరు మండ లం నాచారం గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. తొలుత ఏన్కూరు నుంచి నాచారం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..: ఆర్యవైశ్య కల్యాణ మండపంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మార్క్‌ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ బుధవారం వృద్ధులకు చీరెలు, గొల్లపూడి వృద్ధాశ్రమంలో బుధవారం పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దార్న రాజశేఖర్, బాణాల వెంకటేశ్వరరావు, అమరనేని మాధవరావు, గుమ్మా రోశయ్య, మిట్టపల్లి నాగి, వెంకటేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వర్లు, శాఖమూరి లోకేశ్వరరావు, చిన్నరాములు, సలీం, నరసింహారావు, వీసం శ్రీనివాసరావు, సుబ్బారావు, గుగ్గిళ్ల రాధాకృష్ణ, సింగవరపు నరేశ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి16 : మండల కేంద్రం నుంచి తనికెళ్ల గ్రామం వరకు బుధవారం భారీబైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం తనికెళ్ల గ్రేస్ కళాశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోసు మధు, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు, రామారావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, బాబురావు, ప్రకాశం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీ కవిత ఆధ్వర్యంలో బస్వాపురం బాలికల ఆశ్రమ పాఠశాలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు.పోట్ల శ్రీనివాసరావు, మాధవరావు, పోగుల శ్రీనివాసరావు, మౌలానా, బండారు కృష్ణ, నరసింహారావు, రవి, కొచ్చర్ల భిక్షం, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, నాగేంద్ర, వీరన్న పాల్గొన్నారు.
కారేపల్లి,ఫిబ్రవరి 16 : కారేపల్లిలో టీఆర్ఎస్ నాయకులు పీహెచ్సీలో రోగులకు బుధవారం పండ్లు పంపిణీ చేశారు. బస్టాండ్ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఎమ్మెల్యే మొక్కలు నాటి మాట్లాడారు. ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, తోటకూరి రాంబాబు, మల్లెల నాగేశ్వరరావు, ఆదెర్ల స్రవంతి, అజ్మీర నాగేశ్వరరావు, రామారావు, కోటి పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 16 : రక్తహీనతతో బాధపడుతున్న వారి కోసం కేసీఆర్ బర్త్‌డే కానుకగా రక్తాన్ని అందిస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రెండోరోజు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 110 మంది విద్యార్థులు, యువకులు రక్తదానం చేశారు. కొత్తూరు ఉమామహేశ్వరరావు, రఫీ, అంకమరాజు, చల్లగుళ్ల కృష్ణయ్య, దొడ్డా శంకర్రావు, పాలకుర్తి రాజు, మట్టా ప్రసాద్, పవన్, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.
తల్లాడ, ఫిబ్రవరి 16 : నూతనకల్ గ్రామంలో పేదలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో శీలం శ్రీనివాసరెడ్డి, కాంపాటి శశికుమార్, పమ్మి కృష్ణారావు, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాసరావు, రఘు తదితరులు పాల్గొన్నారు.