ఖమ్మం వ్యవసాయం, మార్చి 15: సీఎం కేసీఆర్‌తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఏఎంసీలో నిర్వహించిన సంబురాల్లో ఆమె మాట్లాడారు. కేంద్రం మార్కెట్లను నిర్వీర్యం చేసే ప్రయ త్నం చేసినప్పటికీ సీఎం కేసీఆర్ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. అనంతరం సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం, మార్చి 15: మున్సిపాలిటీల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇంజినీరింగ్, వాటర్‌వర్క్, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచడంపై వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మేయర్ నీరజ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, దోరెపల్లి శ్వేత, పగడాల శ్రీవిద్య, ప్రశాంత్లక్ష్మి, ఆళ్ల నిరీష, రుద్రగాని శ్రీదేవి, దండా జ్యోతిరెడ్డి, బుర్రి వెంకటేశ్వర్లు, మక్బూల్, కార్మిక సంఘం ప్రతినిధులు వినయ్, దాదే సతీశ్, జ్యోతి పాల్గొన్నారు.
పెనుబల్లి, మార్చి 15: ఉపాధి పథకంలో విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఫీల్ట్అసిస్టెంట్లు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, సర్పంచ్ తేజావత్ తావూనాయక్ పాల్గొన్నారు.
వేంసూరు, మార్చి 15: ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంచేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకటేశ్వరరావు, జానీ, వర్మ, నర్సింహారావు, ప్రసాదరెడ్డి, మల్లయ్య, ప్రసాద్, రామలింగం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.