చెక్కుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వేంసూరు, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిలా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. మండలంలోని పల్లెవాడ, చౌడవరం, వేంసూ రు, మర్లపాడు, లచ్చన్నగూడెం, రాయుడుపాలెం, మొద్దులగూడెం, బీరాపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్ర ఆదివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టం చేశా రు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ దేశం చూ పును తెలంగాణ వైపు తప్పిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఈ సందర్భంగా రాయుడుపాలెం, వేంసూరు ప్రాథమిక, హెచ్‌డబ్ల్యూ పాఠశాలల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తన సొంత ఖర్చులతో చీరెను కూడా బహుమతిగా అందజేశారు. ఆయా గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారను. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.