ఖమ్మం, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ, పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి దేశంలో మరే ప్రభుత్వం చేయడంలేదని, మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొని కేక్ కట్‌చేసి టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులకు అందజేశారు. మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో మహిళలు, ప్రజాప్రతినిధులు, నగర కార్పొరేటర్లు వేడుకల్లో పాల్గొన్నారు. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల శకటాలు, మహిళలతో ప్రదర్శన నిర్వహించారు.
మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఇల్లెందులో మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మణుగూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ వీపీ.గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మహిళా అధికారులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో మహిళను సన్మానించారు. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టేకులపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా సర్పంచ్‌లు, ఎంపీపీని సన్మానించారు. పాల్వంచలో వివిధ స్వచ్ఛంద సంస్థలు పారిశుధ్య కార్మికులకు చీరెలు అందజేశాయి. ఖమ్మం సమీకృత రైతుబజార్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మిప్రసన్న సహస్రజ్యోతి వెలుగులతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లెందులో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. భద్రాచలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం వెంకట్రావు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జూలూరుపాడులో మాజీ ఎంపీ పొంగులేటి మహిళలకు సన్మానం చేశారు