తల్లాడ, మార్చి 4 : గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని, రైతువేదికల ద్వారా రైతులను సమన్వయ పరిచి పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు రైతువేదికలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.పాతపినపాకలో రైతువేదికను డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధితో పాటు, ప్రజల అవసరాలు నెరవేరుతాయన్నారు. తాత్కాలిక ప్రయోజనం చేసేవారి కంటే దీర్ఘకాలికంగా పనిచేసే వారిని గుర్తించాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు విడుదల చేస్తారన్నారు. జాగా ఉన్న వారికి ఇల్లు కట్టే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నరసింహారావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ దుగ్గిదేవర వెంకట్‌లాల్, కోఆర్డినేటర్ వేణు ఎమ్మెల్యేను సన్మానించారు.
అభివృద్ధిని అడ్డుకోవద్దు …: రాజకీయ కక్షలతో, గ్రూప్ రాజకీయాలతో గ్రామాల అభివృద్ధిని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మల్సూరుతండా లో సీసీరోడ్డుకు శంకుస్థాపన, గొల్లగూడెం, పినపాకలో సీసీరోడ్లు ప్రారంభం, శంకుస్థాపన, పల్లెప్రకృతివనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, తర్వాత అందరూ ఒకరేనన్నారు. గొల్లగూడెం చెక్‌డ్యాం విషయంలో హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దూపాటి భద్రరాజు, దుగ్గిదేవర వెంకట్‌లాల్, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, బద్ధం కోటిరెడ్డి, వజ్రాల రామిరెడ్డి, కోడూరి వీరకృష్ణ, జీ.వీ.ఆర్, కట్టా రామకృష్ణ, నల్లమోతు రామారావు, పోతురాజు వెంకటయ్య, జొన్నలగడ్డ కిరణ్, దూపాటి నరేశ్రాజు, మువ్వా మురళి, మోదుగు ఆశీర్వాదం, కాంపాటి జమలయ్య, నారపోగు వెంకటేశ్వర్లు, తేలపుట్ల స్వరాజ్యం, మాలోత్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, కల్లూరు, మార్చి 4 : ఈనెల 6, 7, 8 తేదీల్లో జరిగే మహిళా బంధు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో, కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగిన నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈ నెల 6న స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో ఉదయం 10 గంటలకు మండలంలోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సన్మానం ఉం టుందని అన్నారు. 8న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ ఉంటుందన్నారు. సమావేశంలో నాయకులు పాలెపు రామారావు, బీరవల్లి రఘు, కట్టా అజయ్‌బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, పెడకంటి రామకృష్ణ, కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.