ఖమ్మం/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 3: తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 107 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.07 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 33 మందికి మంజూరైన రూ.18.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ముందుగా నగరంలోని త్రీటౌన్ పరిధిలోని 17, 27, 28, 29, 30, 31, 34, 47, 48 డివిజన్లలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతోందన్నారు. గర్భిణులు, అప్పుడే పుట్టిన శిశువుల నుంచి పండు ముదుసలి వయస్కుల వారి వరకూ తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అందజేస్తోందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు.
మన రాష్ట్ర పథకాలను అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేని కొన్ని పార్టీల నాయకులు ఇష్టారీతిన మాట్లాడడం సరి కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కేఎంసీ మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, ధనాల రాధ, గజ్జెల లక్ష్మి, డోన్వాన్ సరస్వతి, మక్కల కమలమ్మ, దొడ్డా నగేశ్, కొప్పెర సరిత, రుద్రగాని శ్రీదేవి, తోట గోవిందమ్మ, మాటేటి లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పాలడుగు పాపారావు, వడ్డెల్లి లెనిన్చౌదరి, గజ్జెల వెంకన్న, రాజేశ్, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం అర్బన్ పరిధిలోని గొల్లగూడెం, వైస్ఆర్నగర్, పుట్టకోట, బాలప్పేట, బల్లేపల్లి, పాండురంగాపురం, ప్రశాంతినగర్, యూపీహెచ్ కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లోనూ మంత్రి అజయ్‌కుమార్ ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, మలీదు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి నీరజ, సరిపూడి రమాదేవి, ఏఎంసీ డైరెక్టర్ అజ్మీరా వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు నర్రా ఎల్లయ్య, కుర్రా మాధవరావు, ఉపాధ్యక్షుడు చిలుమూరు కోటి, ఎండీ ఫయాజ్, యెచ్చు ప్రసాద్, షేక్ వలీ, దేవభక్తుని కిశోర్‌బాబు, వాంకుడోతు సురేశ్, చిలుకోటి వెంకట సుబ్బారావు, షేక్ రజీం, మల్లేశం, తంగెళ్లపల్లి శ్రీనివాస్, చల్లా శ్రీను, కొట్టే నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.