ఖమ్మం : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ఖమ్మంలోని టీఎన్జీవోస్ యూనియన్ కు చెందిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ల పిలుపు మేరకు గురువారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్. అఫ్జల్ హసన్, ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేక్ అఫ్జల్ హసన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం బాధాకరం అన్నారు. మోదీ తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.