కూసుమంచి, నవంబర్ 6: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే రాష్ట్రంలో మరిన్ని పథకాలు అమలవుతాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా పాలేరులో బీఆర్ఎస్ గెలిస్తే ఎన్నికలు ముగిసిన వెంటనే నియోజకవర్గంలోని ఎస్సీలందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కూసుమంచి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. మల్లేపల్లి, జక్కేపల్లి ఎస్సీకాలనీ, జక్కేపల్లి, భగవాన్తండా, బూరేనిగుట్ట తండా, హీరామాన్తండా, ఎర్రగడ్డతండా, దుబ్బతండా, నర్సిహులగూడెం, నానుతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆయనకు మహిళలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కందాళ మాట్లాడుతూ..
స్థానికుడిగా తాను ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకున్నానని గుర్తుచేశారు. మీ గ్రామాల్లో సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని వాటిని పరిష్కరించానని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన వాటిని సమకూర్చానని వివరించారు. మీకు మరింత సేవ చేసేందుకు ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కావాలని కోరారు. కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే, పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త బానోత్ చంద్రావతి మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన గిరిజనాభివృద్ధికి పాటుపడిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని స్పష్టం చేశారు. మరో సమన్వయకర్త తాళ్లూరి జీవన్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధించాకే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బాణోత్ శ్రీనివాస్, చాట్ల పరశురాం, రామభారపు రమేశ్, బజ్జూరి రాంరెడ్డి, బాణోత్ రాంకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, కొత్తా రాంరెడ్డి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, ఇంటూరి బేబీ, నల్లబోలు చంద్రారెడ్డి, వేముల వీరయ్య, ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.