ఖమ్మం, డిసెంబర్ 8 : జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్ మార్గదర్శకుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ అడుగేస్తే విజయం తథ్యమన్నారు.
ఆయన గర్జిస్తే ప్రత్యర్థుల కోటలు బద్ధలవుతాయని, వ్యూహానికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనే సింహబాణం దేశాన్ని పాలిస్తున్న దుర్మార్గ పాలనపై దండెత్తిన ఆయుధమని, దేశానికి మంచి రోజులు తీసుకొచ్చే వరకు పోరు ఆగదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధర్మయుద్ధానికి అందరూ మద్దతుగా ఉండాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.