ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో విద్యుత్ హై టెన్షన్ వైర్ల కారణంగా మరణించిన ముత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- మహబూబాద్ జాతీయ రహదారిపై కస్నా తండవాసులు ధర్నాకు దిగారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పల్లెగూడెం సబ్ స్టేషన్ ఎదుట ముత్తమ్మ మృతదేహాన్ని ఉంచి ఆందోళన నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు రాకుండా అడ్డుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
మండుటెండలో ప్రధాన రహదారిపై కూర్చొని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. తమ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ధర్నా కార్యక్రమంలో చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఘర్షణకు తావు లేకుండా ఉండేదుగాను ఖమ్మం రూరల్ పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు