Electricians | కారేపల్లి, సెప్టెంబర్ 21 : ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల ఎలక్ట్రిక్ విభాగాల్లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకొని ఉపాధిని కల్పించి ఆర్థిక చేయూతనందించాలని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి కారేపల్లి మండల ప్రైవేటు ఎలక్ట్రిషన్స్ యూనియన్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోగిల్ల వెంకటేశ్వర్లు,షేక్ ఖాజావలి అన్నారు. సింగరేణి మండల కేంద్రంలోని సుబ్బయ్య కుంట సమీపంలోని గంగమ్మగుడి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్లో ఆదివారం మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సింగరేణి మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు యర్రా నరసింహారావు, నల్లపాటి శ్రీనివాసరావు, అద్దంకి వీర భద్రాచారి, అబ్దుల్ ముఖం, బోళ్ల రామస్వామి, పోలోజు రామాచారి, సీఐటీయూ మండల కన్వీనర్ కే నరేంద్ర, సీఐటీయూ సీనియర్ నాయకులు ముక్కా సీతారాములు, సీఐటీయూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కేలోతు రవి, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, మోటర్ మెకానిక్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యుత్, వ్యవసాయ మోటార్ల మరమ్మత్తుల్లో సకాలంలో స్పందించే ప్రైవేట్ ఎలక్ట్రికల్ మెకానిక్‌ల సేవలు అభినందనీయమన్నారు.
ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేసి ఉపయోగించుకొని ఆర్థిక లబ్ధిని చేకూర్చాలని కోరారు. అనంతరం వ్యాపారవేత్తలను ఎలక్ట్రికల్ మెకానిక్‌లు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు బోగిల్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు షేక్ ఖాజావలి,సెక్రెటరీ కేతమల్ల శ్రీనివాసరావు, సహాయ సెక్రెటరీ కుమ్మరి నవకిషోర్,ప్రచార కార్యదర్శిలు కే.పృథ్వీరాజ్,మాజీద్ పాషా,యాకూబ్ పాషా, గౌరవ సలహాదారులు బొందల వెంకటేశ్వర్లు, భూక్య హుస్సేన్, పిట్టల నాగరాజు, షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు