కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 6,7,8,9,10తరగతులకు గాను ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు గత నెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించామన్నారు.
అందుకు సంబంధించిన పరీక్షలో అర్హత సాధించి ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను పాఠశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రవేశం పొందే విద్యార్థులు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయం సర్టిఫికెట్, మూడు పాస్ ఫొటోలు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ లను ఈనెల 20వ తేదీ నుండి జూన్ 1వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు.