Karepalli | కారేపల్లి , ఆగస్టు 11 : ఖమ్మం జిల్లా కారేపల్లిలో విషాదం నెలకొంది. కశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో కారేపల్లికి చెందిన ఆర్మీజవాను మృతిచెందారు.
వివరాల్లోకి వెళ్తే.. కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన బానోతు అనిల్ (30) కశ్మీర్ లోయలో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం గస్తీ నిర్వహిస్తుండగా అనిల్ ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ క్రమంలో గల్లంతైన బానోతు అనిల్ దుర్మరణం చెందాడు. అనిల్‌కు భార్య రేణుక, 8 నెలల కుమారుడు ఉన్నారు. బానోతు అనిల్ మృతితో సూర్యతండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.