ఖమ్మంరూరల్, డిసెంబర్ 21: రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ రాబోయే కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరుపాడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చిచెప్పారు. ఖమ్మంరూరల్ మండలం గూడూరుపాడులో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అమ్మరాజు అధ్యక్షతన పార్టీ ఆత్మీయ సమ్మేళనం హర్షిణి డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కందాలకు పార్టీ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యులను కందాల సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో సీపీఎం, బీఆర్ఎస్ పొత్తును ప్రజలు స్వాగతించారని అన్నారు. పెద్దఎత్తున ఆశీర్వదించిన ప్రతి ఓటరుకూ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు బెల్లం వేణు, పగడాల నాగరాజు, అల్లిక వెంకటేశ్వరరావు, ఉన్నం బ్రహ్మయ్య, కూరాకుల వలరాజు, జానయ్య, పడిగల వెంకటేశ్వర్లు, కుర్రి లింగయ్య, బట్టు మహేష్, కుర్రి తిరుపతిరావు పాల్గొన్నారు.
గూడూరుపాడులోని పలు పార్టీలకు చెందిన మారుతి రామారావు, సత్తి వీరబాబు, కొలిచలం గోపయ్య, కుర్రి లింగయ్య, సత్తి జానకిరామయ్య, మారుతి లింగయ్య, బండి రామారావు, మారుతి వెంకయ్య, మారుతి అంజయ్య, సత్తి రామారావు, బట్టు క్రిష్ణమూర్తి, కుర్రి నాగయ్య, భగత్‌సింగ్, మారుతి అంజయ్య తదితరులు కందాల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.