కూసుమంచి, నవంబర్ 2: కరువు కోరల్లో ఉన్న పాలేరు ప్రజలను ఆదుకొని అక్కున చేర్చుకున్నది ముఖ్యమంత్రి కేసీఆరేనని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి కరువును పారదోలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కూసుమంచి మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. భగత్‌వీడు కాలనీ, భగత్‌వీడు, సోమ్లాతండా, సీతిలీ తండా, మందడి నర్సయ్యగూడెం, బికారితండా, మంగలితండా, మద్దివారిగూడెం, ఈశ్వరమాదారం, రాజుపేట బజార్, తాళ్లగడ్డతండా, రాజుపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. అందుకని ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
నిత్యం మీ మధ్యనే ఉంటూ, మీ కష్టనష్టాల్లో తోడుగా నిలుస్తున్న తనను కూడా ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మాట ఇచ్చారు. కాగా, ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే కందాళకు ఘన స్వాగతం పలికారు. మహిళలు వచ్చి హారతులిచ్చి బొట్టు పెట్టారు. కందాళ సొంత గ్రామంతోపాటు శివారు గ్రామాల్లో జరిగిన ప్రచారానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కందాళ సురేందర్‌రెడ్డి, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి శేఖర్, వేముల వీరయ్య, ఆసీఫ్, కంచర్ల వీరారెడ్డి, అరుణ, రవి, జావత్ రాములు, భూక్యా శ్రీను, తంగెళ్ల బుచ్చిబాబు, కొక్కిరేణి సీతారాములు, భూక్యా భీక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.