Jagadish Reddy Suspension : అసెంబ్లీలో ప్రశ్నించినందుకే సస్పెన్షన్ చేయడం దారుణం : లింగాల కమల్‌రాజు
అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వక మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెన్షన్ చేయడం దారుణమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
మధిర, మార్చి 14 : అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వక మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెన్షన్ చేయడం దారుణమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనటువంటి ఆరు హామీలను గవర్నర్ ద్వారా అమలు చేసినట్లుగా చెప్పడం జరిగిందన్నారు. ఈ అబద్ధాలపై అసెంబ్లీలో ప్రశ్నించినందుకు జగదీశ్‌రెడ్డిని అక్రమ సస్పెన్షన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు.
కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా మాజీ మంత్రిపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజానీకమంతా మీడియా ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. వాస్తవం ఏమిటో కాంగ్రెస్ మంత్రులకి తెలుసని, ప్రభుత్వాన్ని విమర్శించే వారు అసెంబ్లీలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే కక్ష కట్టి వ్యవహరించినట్లు చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరిగె శ్రీనివాస్‌రావు, కటికల సత్యనారాయణరెడ్డి, యన్నంశెట్టి వెంకట అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వర్రావు, షేక్ ఖాదర్, వేమిరెడ్డి పెదనాగిరెడ్డి, పల్లపాటి కోటేశ్వర్రావు, ఆళ్ల నాగబాబు, పరిస శ్రీనివాస్‌రావు, చీదిరాల రాంబాబు, కొత్తపల్లి నరసింహారావు, షేక్ సైదా అబ్దుల్ ఖురేసి, కోట కోటేశ్వర్రావు, వీరంశెట్టి సీతారామయ్య, కాకుమాను కృష్ణమూర్తి, కప్పగంతుల పట్టాభి రామశర్మ, బత్తుల శ్రీనివాస్‌రావు, ఆవుల గోపి, సంపసాల కొండ, ఓరుగంటి విజయ్, షేక్ జాన్ సైదా, షేక్ మౌలాలి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

