khammam | బోనకల్లు : బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఇవాళ న్యాయ చైతన్య అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మధిర జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. పొక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి టెన్త్, ఇంటర్ క్లాస్ పిల్లలు, బాలికలకు వివరించారు.
పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలని.. మంచిగా కష్టపడి,ఇష్టంతో చదవాలన్నారు కార్తీక్ రెడ్డి. పిల్లలకు ఎలా చదవాలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి తెలియజేశారు. అనంతరం వంట గది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు కోట వెంకట్, కన్నెపోగు వెంకటేశ్వర్లు , ప్రిన్సిపాల్ పద్మావతి, కోర్టు సిబ్బంది వెంకన్న, మల్లేశం, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్