ఖమ్మం లీగల్, ఆగస్టు 31 : జిల్లావ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్‌పై తీసుకోవాల్సిన చర్యలు, న్యాయాధికారులతో ఖమ్మం నగరంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వాస్తవానికి ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాల్సి ఉందని, అయితే గణేశ్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28వ తేదీకి మార్చినట్లు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
.