ఖమ్మం రూరల్, మార్చి 13 : ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఖమ్మం బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పెల్లూరి విజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఉప కులాల ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఐదో రోజుకి చేరాయి.
ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలను మాలలకు కట్టబెడుతుందని, న్యాయం జరిగే దాకా ఈ దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలకు బీసీ సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటాల్లో సైతం పాల్గొననున్నట్లు వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎస్పి ఇన్చార్జి నాయకుడు, జాతీయ కోర్ కమిటీ నాయకుడు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ, కనకం జనార్ధన మాదిగ, ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఎంఎస్పి రూరల్ మండల అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు గద్దల లక్ష్మణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుci బోయిన కృష్ణ మాదిగ, బీజేవైఎం నాయకుడు వల్లాల రమేశ్, యువజన మోర్చా అధ్యక్షుడు కందుల శ్రీకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.