చింతకాని, నవంబర్ 27: ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. ఆదివారం మండలంలోని అనంతసాగర్‌లో పల్లెప్రగతి పనులను సర్పంచ్ నూతలపాటి మంగతాయమ్మ, రైతుబంధుసమితి గ్రామ కన్వీనర్ నూతలపాటి వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి పల్లెలుగా రూపొందాయన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పెంట్యాల పుల్లయ్య, కోపూరి పూర్ణయ్య, కిలారు మనోహర్‌బాబు, గురజాల హనుమంతరావు, బండి రామారావు, బొడ్డు వెంకట్రామయ్య, గడ్డం శ్రీనివాస్, చాట్ల సురేశ్, వంకాయలపాటి వెంకట లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కలలకు ప్రాణం పోసేవాడే కళాకారుడు
మధిరరూరల్, నవంబర్ 27 : మండలంలోని ఆత్కూరు గ్రామంలో అబ్బూరి వారి మామిడితోటలో సీతారామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి ఉమ్మడి జిల్లా కళాకారులు వనసమారాధన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడి పోతున్న కలలకు ప్రాణం పోస్తున్న కళాకారులకు అభినందనలు తెలిపారు. కళానైపుణ్యం కలవారే కళాకారులని, ప్రేమ, బాధ లాంటి భావోద్వేగాలు కళారూపంలో చూపించడమే కళాకారుడి గొప్పతనమన్నారు.
ప్రతి సంవత్సరం వనసమారాధన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కళాకారులు కలుసుకోవడం ఒక మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సీతారామాంజనేయ కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, తలపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.