మధిర, ఆగస్టు 06 : స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ వైవీ అప్పారావు, మధిర శివాలయం మాజీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, వార్డు మాజీ కౌన్సిలర్ ధీరావత్ మాధవి, ముత్తవరపు ప్యారి, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, లంకెమళ్ల నాగేశ్వరరావు, అబ్దుల్ ఖురేషి, ఆరుద్ర కొండలరావు, నాగులవంచ రామారావు, కోటా కోటేశ్వరరావు, గుగులోతు కృష్ణ నాయక్, వేల్పుల శ్రీను, షేక్ జాన్ సైదా, షేక్ మౌలాలి, అద్దంకి నాగరాజు, షేక్ మదార్, మేడిద రవికుమార్, బెజం కిరణ్, సంపసాల కొండ, ఆవుల నరేంద్ర పాల్గొన్నారు.