మధిర, మే 23 : పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మధిర సీపీఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఉపాధ్యాయులందరూ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని పాఠశాలలను క్లబ్ చేస్తూ మూడు పాఠశాలల్లో అన్నింటినీ విలీనం చేయడం నష్టదాయకమన్నారు. దీనిపైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు.
విద్యా సంస్కరణలు చేపట్టే ముందు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయ సంఘం నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోత్కురి మధు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి, రాష్ట్ర బాధ్యులు రెబ్బా. శ్రీనివాసరావు, తూమాటి కృష్ణారెడ్డి, జిల్లా బాధ్యులు రత్నకుమార్, చంద్రశేఖర్, సీహచ్ వి. రవికుమార్, మధిర మండల బాధ్యులు తెల్ల మేకల శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాస్, బాబురాజ శ్యామలరావు, పీడీపీ జ్యోతి పాల్గొన్నారు.