ఖమ్మం : ఖమ్మం జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బాలల సదనంలో జరిగిన వేడులకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమశాఖ అధికారి సీహెచ్ సంద్యారాణీ, చైల్డ్ వేల్పేర్ కమిటీ చైర్ పర్సన్ భారతీరాణీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సదనంలోని బాలికలతో కలిసి వారు కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ప్రస్తుత సమాజంలో స్త్రీలు పురుషులతో పోటీపడి అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. బాలికలు సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి పోషక విలువలతో కూడిన పదార్థాలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీడబ్యూసీ సభ్యులు అనిత, లింగయ్య, డీసీపీఓ టీ విష్ణువందన, బాలల సదనం పర్యవేక్షకురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.