కారేపల్లి, సెప్టెంబర్ 17 : కారేపల్లి మండలం చిన్నమడెంపల్లి గ్రామ పంచాయతీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు అన్నారు. బుధవారం చిన్నమడెంపల్లి పంచాయతీ, పెద్దమడెంపల్లిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ప్రధాన రహదారి తప్పా మిగతా రహదారులపై నడవలేని పరిస్ధితి ఉందన్నారు. ప్రధాన రహదారి సీసీ రోడ్డు మూడునాళ్లకే బీటలు వారిపోయిందని తెలిపారు. రాత్రి సమయంలో వాహనదారులు రోడ్డు పగుళ్లలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు.
పంచాయతీలలో చిన్న పనులు చేయడానికి కూడా నిధులు లేక పారిశుధ్య పనులు ఆగిపోయాయన్నారు. దీంతో రహదారులపై నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రభుత్వం స్పందించి పంచాయతీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎజ్జు రత్నం, ఎర్రమళ్ల రాజు, దార్ల జయరాజు, దేవరాజు, ఎజ్జు భూషణం, ఠాకూరి రమేష్, ఎజ్జు పుష్ప పాల్గొన్నారు.