కారేపల్లి, ఆగస్టు 23 : కారేపల్లి మండలంలోని కారేపల్లి మోడల్ స్కూల్, గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకులం, తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకులంను మండల అధికారులు శనివారం తనిఖీ చేశారు. మోడల్ స్కూల్, గిరిజన గురుకులాలను ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేంద్రరావు, ఏకలవ్య పాఠశాలను వ్యవసాయాధికారి బట్టు అశోక్‌కుమార్, ఏఈఓ బి.నరేశ్ తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులు, వంట రూము, స్టాక్ రూములను పరిశీలించారు. విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ఆదేశానుసారం వేడి వేడి అన్నం వడ్డించాలని, మెనూ క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు.