కారేపల్లి, నవంబర్ 18 : కారేపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరువులు, పురుగుమందుల స్టాక్‌తో పాటు, విక్రయించిన ఎరువులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన క్రిమి సంహారక మందులు, ఎరువులను అందజేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం యూరియా రైతులకు అందుబాటులో ఉంచేందుకు లైసెన్స్ కలిగి ఉన్న ఎరువుల దుకాణదారులకు కూడా సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.