కారేపల్లి, నవంబర్ 26 : కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు. భోజనశాల, స్టోర్ రూమ్, టాయిలెట్స్, ఆహార పట్టిక, తరగతి గదులు, ప్రయోగశాల, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. గురుకులంలో సౌకర్యాలపై డీఐఈఓ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రిన్సిపాల్ సావిత్రి తెలిపారు. ఆయన వెంట మైనారిటీ సంస్థ ఖమ్మం ఆర్ఎల్సీ అరుణ కుమారి ఉన్నారు.