– అక్రమంగా మట్టి, కలప రవాణా చేస్తున్నారు
– అవినీతి అక్రమల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్రపై దర్యాప్తు చేయాలి
– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్
ఖమ్మం, జూన్ 20 : ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలని అన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాల్వ మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని పువ్వాడ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ప్రతి భూ దందాల్లో, మట్టి, ఇసుక మాఫియాల వెనుక మంత్రుల పాత్ర ఉందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.