సర్వే సిబ్బందికి సమాచారం ఇవ్వండి : కలెక్టర్ వీపీ గౌతమ్
సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బందికి యజమానులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
చింతకాని, ఫిబ్రవరి 8 : సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బందికి యజమానులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వందనం గ్రామంలో చేపట్టిన సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వడంతోపాటు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగి ఉండి..
తప్పులు దొర్లిన ప్రతి కుటుంబానికి సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకొని సర్వే సిబ్బందికి తెలియజేయాలన్నారు. సర్వే సిబ్బంది సైతం డేటా ఎంట్రీ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అలాగే నాగులవంచ, పందిళ్లపల్లి, వందనం, నేరడ తదితర గ్రామాల్లో చేపట్టిన సర్వేను జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన పరిశీలించి.. అధికారులకు సూచనలిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్యదర్శులు చెవుల మహేశ్, వల్లంకొండ మరళి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

