సత్తుపల్లి రూరల్, మే 13 : కొత్తూరులోని మదర్‌థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల (మిస్ట్)లో బీటెక్ మెకానికల్ 2, 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వర్క్‌షాప్‌ను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణ ప్రారంభించారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ కోర్సును నేర్చుకోవడం ద్వారా వారి బీటెక్ పూర్తయిన వెంటనే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ఆటో మొబైల్, ఎయిర్ స్పేస్ రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు ఇలాంటి వర్క్‌షాప్‌కు హాజరై సృజనాత్మకత, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పలువురు హెచ్వోడీలు పాల్గొన్నారు.