కారేపల్లి, మే 4: ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరింరంటూ కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్తులు ఆరోపించారు. పెద్దలకు, గ్రామానికి చుట్టచూపుగా వచ్చిపోయే వారికి ఇండ్లు మంజూరు చేశారని భగ్గుమన్నారు. ఈ మేరకు గ్రామంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పక్రియను ఇందిరమ్మ కమిటీ బాధ్యులకు అప్పజెప్పడంతో డబ్బులిచ్చిన వారికే వారు ఇండ్లు మంజూరు చేయిస్తున్నారంటూ విమర్శించారు. భాగ్యనగర్తండామహిళలు పురుగులమందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తమకు వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ న్యాయం చేయకపోతే ఇదే పురుగుమందు తాగి చనిపోతామంటూ నందిని, సునిత, కైకా, కాంతి స్పష్టం చేశారు.