కూసుమంచి, జూన్ 6 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామంలో అన్ని అర్హతలున్న పేదలకు ఇండ్లు మంజూరు చేయకుండా.. భూములు, ఆస్తులు ఉన్న వారికి ఎలా ఇండ్లు మంజూరు చేస్తారని, ఇందులో కార్యదర్శి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.