కారేపల్లి, మే 14 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగం పెరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సింగరేణి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులలో మరింత వేగంతో పెంచేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. జూన్ 2వ తేది నుండి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉండడం వల్ల, ప్రస్తుతం మంజూరై నిర్మాణం జరుగుతున్న జిల్లా నిర్మాణ పనులను మరింత వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీఓ కోటేశ్వరరావు, హౌసింగ్ ఏఈలు నాగేంద్ర, స్వప్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్‌రావు పాల్గొన్నారు.