మధిర, ఆగస్టు 08 : ప్రజా ప్రభుత్వంలో భూస్వాములకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మరి అర్హులైన నిరుపేదల పరిస్థితి ఏంటని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం చింతకాని తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు తీసుకునే వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త అయ్యుండాలని, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదన్నారు.
అనంతరం తాసీల్దార్ కరుణాకర్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాచబంటి రాము, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, దేశబోయిన ఉపేందర్, గడ్డం కోటేశ్వరరావు, లింగం కోటేశ్వరరావు, ఆలస్యం రవి, తోటకూరి వెంకట నరసయ్య పాల్గొన్నారు.
Madhira : భూస్వామికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, నిరుపేదల పరిస్థితి ఏంటి ?