బోనకల్లు, జనవరి 10: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం ఈ నెల 18న మొదటి బహిరంగ సభ ఖమ్మంలో జరుగుతున్నదన్నారు. సభకు సీఎం కేసీఆర్‌తోపాటు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు మధిర నియోజకవర్గ ఇన్చార్జులుగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావును పార్టీ అధినేతలు నియమించినట్లు తెలిపారు. బోనకల్లులో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం రోడ్డులోని ఎస్ఆర్ ఫంక్షన్హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు, కార్య కర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయ కులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశంలో మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరా వు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాసరావు, జంగా రవికుమార్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
చింతకాని, జనవరి 10: ఈ నెల 18న జరుగనున్న సీఎం కేసీఆర్ సభకు భారీ జనసమీకరణ చేయాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని నాగులవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్ధాయి బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు నాగులవంచలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండలంలోని 26 గ్రామశాఖలు, అనుబంధ సంఘాల సమావేశం జరుగుతుందని, కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కొటేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాలకు నాగభూషణం హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌కు పరామర్శ
మధిర రూరల్, జనవరి10: మధిర మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఇటీవల మో కాలు ఆపరేషన్ చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మ న్ మంగళవారం మండలంలోని ఇల్లూరు గ్రామంలో నాగేశ్వరరావును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన వెంట కౌన్సిలర్ మల్లాది వాసు, నాయకులు సయ్యద్ ఇక్బాల్, కనుమూరు వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు ఉన్నారు.
చిన్నికి నివాళి అర్పించిన జడ్పీచైర్మన్
మధిరటౌన్, జనవరి 10: పట్టణంలోని ఎస్సీకాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ వార్డుసభ్యు డు గద్దల చిన్ని అనారోగ్యంతో మంగళవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళి అర్పించిన వారిలో మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.