– అది తన స్థలమేనంటూ కబ్జాదారుడి కోర్టు నోటీస్
– మీడియా సమావేశంలో రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని ఆవేదన
మధిర, నవంబర్ 11 : డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత స్థల యజమాని మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 221లో 254.8 చదరపు గజాల స్థలాన్ని 12 ఫిబ్రవరి 2009లో చెరుకుమల్లి వెంకటేశ్వరరావు ఆయన పూర్వీకుల నుండి వారికి సక్రమించిన ఆస్తిని కిలారు మార్కండయ్య, గూడపాటి అనుసూర్య కొనుగోలు చేసినట్లు తెలిపారు. దానికి సంబంధించిన డ్యాకుమెంట్ నంబర్ 905/20 020 ఆఫ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధిర రిజిస్ట్రేషన్ పొందారన్నారు.
ఆ తరువాత 2020 జనవరి 29న కిలారు మార్కండేయ, గూడపాటి అనసూర్య పార్టిషన్ చేసుకున్నట్లు తెలిపారు. మార్కండేయ్య 390/2020, గూడపాటి అనుసూర్య 390 /2020 సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న డ్యాకుమెంట్ల ఉన్నట్లు తెలిపారు. గూడపాటి అనుసూర్యకు సంబంధించిన ఇంటి స్థలాన్ని గింజుపల్లి శంకరయ్యకు గిఫ్ట్ డీడ్ 393/2020 సబ్ రిజిస్టార్ ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ స్థలాన్ని 18 సెప్టెంబర్ 2024న గింజుపల్లి శంకరయ్య, కిలారు మార్కండేయలు దగ్గర్నుంచి తాను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు భాస్కరరావు మీడియాకు తెలిపారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్ నంబర్ 2776/2024 గల పత్రాలను వెల్లడించారు.
తన ఇంటి నిర్మాణం కోసం మధిర మున్సిపాలిటీ నుండి అనుమతులు పొంది ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఈ స్థలంలో రూ.25 వేల టోకెన్ అమౌంట్ చెల్లించి మున్సిపాలిటీ కార్యాలయం నందు అక్రమ మార్గంలో అక్రమార్కుడు ఇంటి నిర్మాణాలు లేకుండా ఇంటి నంబర్‌ను పొందినట్లు తెలిపారు. మధిరకు చెందిన చెరుకూరి నాగార్జున అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని హైకోర్టు నుండి మున్సిపాలిటీ అధికారుల ద్వారా నోటీసులను జారీ చేయడంతో అవాక్కైనట్లు భాస్కర్‌రావు వాపోయారు. ఎలాంటి ఒరిజినల్ డ్యాకుమెంట్లు, రిజిస్ట్రేషన్ లేకుండా సంబంధిత అధికారులు ముడుపులు తీసుకున్నారని మండిపడ్డారు. తన స్థానంలో అక్రమ మార్గంలో నాగార్జునకు 6 -31/సి/1 ఇంటి నంబర్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా వెంటనే వాస్తవాలను గ్రహించి తగిన విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని, మధిర మున్సిపాలిటీలోని అవినీతిపరులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.