బోనకల్లు, ఆగస్టు 29 : బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మధులత, జశ్విత పలు జాతీయ, రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులను ఖమ్మం జిల్లా క్రీడల, యువజన అధికారి సునీల్ రెడ్డి సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించి వారిని సన్మానించినందుకు జిల్లా క్రీడల యువజన శాఖ అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ కోచ్ లింగయ్య, సీనియర్ క్రీడాకారులు, బోనకల్లు మండల అధికారులు, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి అభినందనలు తెలిపారు.