బోనకల్లు, జూన్ 23 : ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బోనకల్లు మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో సభ్యత్వం, జనరల్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాథమిక పాఠశాలలకు పీఎస్ హెచ్ఎం పోస్టులు కేటాయించాలని, బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలల్లో ఎల్కేజీ ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు.
ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యేక ఇంగ్లీష్ పోస్ట్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షుడు చిన్న రంగారావు ఉపాధ్యక్షుడు పి.గోపాలరావు, కోశాధికారి జల్లా కోటయ్య, కార్యదర్శులు కె.సురేశ్, పి.నరసింహారావు, ఎం.నారాయణ, కె.నిర్మల, నరేంద్ర సింహ, ఎన్.వెంకటేశ్వర్లు, కేశవరావు, హరికృష్ణ , రామారావు, వి.అరుణ కుమారి పాల్గొన్నారు.