కారేపల్లి, సెప్టెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ హిందీ దివస్ను శనివారం ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు షాహిన సుల్తానా హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప్రాముఖ్యత, భాషా నైపుణ్యత, గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా హిందీ కవుల డ్రాయింగ్, పద్య పఠనం, పాటల పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల ప్రత్యేక అధికారిని జై ఝాన్సీ సౌజన్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఓ ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ.. భారతదేశం విభిన్న భాషలకు నిలయమని, దేశాన్ని ఏకం చేసే గుణం భాషకు మాత్రమే ఉందన్నారు. భాష అంటే కేవలం మనుషుల మధ్య భావం మాత్రమే కాదని, మనుషుల మధ్య దృఢమైన బంధమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్.ఝాన్సీ, ఎం స్వాతి, జి.విజయ, మమత, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
Karepally : కారేపల్లి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఘనంగా జాతీయ హిందీ దివస్