ఎడతెగని వర్షం. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు. రోడ్లు, వంతెనలు, ఇళ్లు, లోతట్టు ప్రాంతాలను ముంచుతున్న వరదలు. అక్కడక్కడా ప్రాణ నష్టం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గజగజా వణుకుతున్న వరద బాధితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా వర్షాలు-వరదలతో ఆదివారం బీతావహ పరిస్థితి కనిపించింది.
– నమస్తే నెట్వర్క్
సారపాక : దోమలవాగు పొంగి పొర్లడంతో సంజీవరెడ్డిపాలెం-మోరంపల్లిబంజరలో నీటమునిగిన వరిపొలాలు
ఆళ్ళపల్లి : రాయిపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని నది
చండ్రుగొండ : సీతాయిగూడెం చప్టాపై నుంచి ప్రవహిస్తున్న ఎదుళ్లవాగు
దుమ్ముగూడెం : పొలాల్లోకి చేరిన వరద
చుంచుపల్లి: మూలుగూడెం వద్ద వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
చుంచుపల్లి: ఎర్రవాగు ప్రవాహం
పాల్వంచ: ఉధృతంగా ప్రవహిస్తున్న మొర్రేడు వాగు