మధిర, మార్చి 13 : మధిర నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మధిర యాదవ్ బజార్ నందు గల షాదీ ఖానాలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, టు డి ఎకో, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ తదితర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ… అసోసియేషన్ సభ్యులందరూ క్యాంప్‌లో పాల్గొనడం సంతోషకరమన్నారు. మున్ముందు ఫొటోగ్రాఫర్ల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం కనకారావు, జిల్లా కోశాధికారి నీరుడు తిరుపతిరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ అంగడాల గోపీనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు మురళీ, మధిర మండల అధ్యక్షులు పార్వతి, సెక్రటరీ ఎడవల్లి శ్రీధర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సాంబశివరావు, సత్తుపల్లి మండలం నుంచి తిరుమలరావు, హరి, సతీశ్, మధిర గౌరవ అధ్యక్షుడు శ్యామారావు, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎడవల్లి నాగభూషణం పాల్గొన్నారు.
Health Camp : మధిర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్