మణుగూరు టౌన్, ఏప్రిల్ 1: హెచ్సీయూ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ప్రతీ మండల కేంద్రంలో నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. హెచ్సీయూ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.