Harish rao | అసలు జూపల్లికి తెలివి ఉందా..? ఢిల్లీకి సంచులు మోసే శాఖలో మాత్రం రేవంత్ పాస్ : హరీశ్ రావు
Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా దాటదు. నువ్వేమైనా తెలిసి మాట్లాడుతున్నవా.. తెలియక మాట్లాడుతున్నవా..? చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందా..? నాకైతే అర్థమైతలేదన్నారు హరీశ్ రావు .
Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. అసలు జూపల్లికి తెలివి ఉందా..? అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రెండు బోనస్‌లు అయితే ఎగ్గొట్టినవ్.. పోయిన యాసంగి బోనస్ రూ.1200 కోట్లు, ఈ యాసంగి బోనస్ రూ. 1000 కోట్లు ఎగ్గొట్టినవ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అంతగొడితే నువ్వు బోనస్ ఇచ్చింది రూ.2500 కోట్లు.. కానీ మీరు ఎగగొట్టిన రైతు బంధు విలువ రూ.29,350 కోట్లు అని ధ్వజమెత్తారు.
జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా దాటదు. నువ్వేమైనా తెలిసి మాట్లాడుతున్నవా.. తెలియక మాట్లాడుతున్నవా..? చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందా..? నాకైతే అర్థమైతలేదన్నారు హరీశ్ రావు .
సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ. ఆయన దగ్గర మూడు శాఖలున్నాయి. విద్యాశాఖ, హోంశాఖ, మున్పిపల్ శాఖ.. ఈ మూడింటిలో కూడా అట్టర్‌ఫ్లాప్ అయిండని హరీశ్ రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులుండి చేసింది గుండుసున్నా. రేవంత్ రెడ్డి మూడు శాఖలు పెట్టుకుని చేసింది కూడా గుండు సున్నా. విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు.. మున్సిపల్ శాఖ, హోంమంత్రిగా ఫెయిల్ అయిండు. కానీ ఒక్క దాంట్లో మాత్రం పాసయ్యిండు. ఢిల్లీకి సంచులు మోసే శాఖలో మాత్రం పాసయ్యిండంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మేమిచ్చిన పంట బోనస్ 3 సార్ల రైతుబంధు కంటే ఎక్కువ అని అంటున్నాడు
అసలు జూపల్లి కృష్ణారావుకు తెలివి ఉందా? వీళ్ళు రెండుసార్లు కలిపి రూ.2500 కోట్ల పంట బోనస్ ఇచ్చారు. ఇంకో రెండుసార్లు ఎగ్గగొట్టారు
కానీ మీరు ఎగగొట్టిన రైతు బంధు విలువ రూ.29,350 కోట్లు… pic.twitter.com/pcbXE3XYo5
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
“ఢిల్లీకి సంచులు మోసే శాఖ” పెట్టుకో రేవంత్ రెడ్డి
హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అన్ని శాఖల్లో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు.. కానీ ఢిల్లీకి సంచులు మోసే శాఖలో పాస్ అయ్యాడు
– హరీష్ రావు pic.twitter.com/Bh5vH7UHMl
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

