మధిర ఫిబ్రవరి 28: చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన నేర్సుల ఎల్లయ్య పంట నష్టపోయి తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ లచ్చగూడెం గ్రామశాఖ ఆధ్వర్యంలో రూ.12వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోధైర్యం కల్పంచి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గురజాల హనుమంతరావు మాట్లాడుతూ..పంటలు పండించి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాగు చేసిన పంటకు సక్రమంగా సాగునీరు అందక రైతులకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు పోట్ల సీతయ్య, పోట్ల అచ్యుతరావు, చింతాల వెంకటేశ్వర్లు, పువ్వాళ్ల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.