కారేపల్లి, ఏప్రిల్ 17 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం పేరపల్లిలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర రేపటితో (శుక్రవారం) ముగియనుంది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. చివరి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడంతో జాతర పరిసమాప్తమౌతుంది. వివిధ గ్రామాల నుండి భక్తులు మేళతాళాలతో ఎడ్లబండ్లపై ప్రభలతో తరలివచ్చి గుడి వద్దకు చేరుకుని మొక్కలు చెల్లించుకున్నారు. జాతర సజావుగా జరిగేందుకు సహకరించిన పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పేరుపల్లి గ్రామ ప్రజలకు జాతర నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు.
Guruvamma Jatara : రేపటితో ముగియనున్న గురువమ్మ జాతర