కారేపల్లి, మే 28 : కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ టస్ట్ర్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు గురువారం రూ.10,016/` ను వితరణగా అందించారు. గేటుకారేపల్లిలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తిరుమలరావును కలువగా స్పందించిన ఆయన అలయానికి విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో వల్లబినేని చంద్రశేఖర్, అలయ నిర్మాణ కమిటీ సభ్యులు సపావట్ నాగులు, శివాజీ పాల్గొన్నారు.