రఘునాథపాలెం, జూలై 11: అమరావతి – నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరం మీదుగా హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భూములను కోల్పోతున్న రైతులు ఖమ్మం ఆర్డీవో ఆఫీస్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం నాయకులు బొంతు రాంబాబు, నాగళ్ల శ్రీధర్, వేములపల్లి సుధీర్ మాట్లాడుతూ.. అమరావతి – నాగ్పూర్ వైపే నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతపు భూసేకరణ చేపట్టడం సరికాదని అన్నారు. నగర పరిధిలో హైవే నిర్మాణంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందన్నారు. మందనపు రవీంద్ర, బోజెడ్ల వెంకటయ్య, నల్లమోతు శ్రీనివాసరావు, వజ్జా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.